Share News

Vice President C.P. Radhakrishnan Cites Devar: నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:22 AM

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నేను నమ్ముతున్నాను. అయితే దీనిని నిరూపించడానికి నావద్ద ఎలాంటి ఆధారం లేదు...

Vice President C.P. Radhakrishnan Cites Devar: నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు

  • ఇది దేవర్‌ మాట: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

చెన్నై అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నేను నమ్ముతున్నాను. అయితే దీనిని నిరూపించడానికి నావద్ద ఎలాంటి ఆధారం లేదు’ అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ (సీపీఆర్‌) అన్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పసుంపొన్‌ గ్రామంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగ దేవర్‌ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. దేవర్‌ స్మారక స్థలం వద్ద నివాళులర్పించారు. ఆ సందర్భంగా సీపీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘దేవర్‌... నేతాజీకి బలమైన మద్దతుదారుడు. ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ అబద్ధమాడలేదు. ఆయన, ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. ఆయనను నేను కలిశాను’ అని చెప్పారు.

Updated Date - Oct 31 , 2025 | 03:22 AM