Voter list revision: యూపీలో 2.89 కోట్ల ఓటర్ల పేర్లు తొలగింపు
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:09 AM
ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో భాగంగా 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల కమిషన్ తొలగించింది..
లఖ్‌నవూ, డిసెంబరు 28: ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో భాగంగా 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. 12.55 కోట్ల మంది పేర్లు జాబితాలో ఉండనున్నాయి. బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, గురువారం నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రణదీప్ రిన్వా చెప్పారు. అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజుల సమయం ఉందని, పేర్లు లేని వారు ఫారం-7 ద్వారా వివరాలు తెలపాల్సి ఉంటుందని తెలిపారు. మరణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో జాబితాల నుంచి పేర్లు తొలగించినట్టు చెప్పారు. ఓటర్లుగా నమోదుకు బూత్ లెవల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫారాలను 8 లక్షల మంది తిరిగి ఇవ్వలేదని తెలిపారు. వాటిని సమర్పించాలని తాము ఒత్తిడి చేయబోమని అన్నారు.