Political Emotion: సర్వేపల్లి అంతటివాడు కావాలనే ఆ పేరు పెట్టాం
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:39 AM
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటివాడు కావాలని ఆకాంక్షించే తన కుమారుడికి ఆయన పేరు పెట్టామని, ఆ నమ్మకం ఇప్పుడు ...
ఇప్పుడదే నిజమైంది.. సీపీ రాధాకృష్ణన్ తల్లి బావోద్వేగం
చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటివాడు కావాలని ఆకాంక్షించే తన కుమారుడికి ఆయన పేరు పెట్టామని, ఆ నమ్మకం ఇప్పుడు నిజమైందని ఎన్‌డీఏ తరఫున అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ మాతృమూర్తి జానకి అమ్మాళ్ భావోద్వేగానికి గురయ్యారు. తిరుప్పూర్‌లో నివాసముంటున్న జానకి అమ్మాళ్ వద్దకు సోమవారం బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి ఆమెకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడిని ఉపరాష్ట్రపతి పదవికి సిఫారసు చేసిన బీజేపీకి, ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.