Share News

PM Modi childhood: మోదీ బాల్యంపై పాఠశాలల్లో సినిమా

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:25 AM

మోదీ బాల్యంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చలో జీతే హై చిత్రాన్ని బడుల్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనపై అనుబంధ...

PM Modi childhood: మోదీ బాల్యంపై పాఠశాలల్లో సినిమా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: మోదీ బాల్యంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన ‘చలో జీతే హై’ చిత్రాన్ని బడుల్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనపై అనుబంధ పాఠశాలలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీబీఎ్‌సఈ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) ఉన్నతాధికారులకు కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ అర్చనా శర్మ అవస్థీ ఇటీవల లేఖలు రాశారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వం, బాధ్యత, సేవాగుణాలను పెంపొందించే దిశగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, 32 నిమిషాల నిడివితో 2018లో విడుదలైన ఈ చిత్రం 2019లో బెస్ట్‌ నాన్‌-ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో జాతీయ అవార్డు కైవసం చేసుకుంది.

Updated Date - Sep 18 , 2025 | 06:29 AM