Share News

Modi Writes Foreword for Melonis Book: ఇది ఆత్మకథ కాదు.. మీ మన్‌ కీ బాత్‌

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:43 AM

టలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ రాసిన ముందుమాట ఆసక్తికరంగా మారింది..

Modi Writes Foreword for Melonis Book: ఇది ఆత్మకథ కాదు.. మీ మన్‌ కీ బాత్‌

  • ఇటలీ ప్రధాని మెలోనీ పుస్తకానికి మోదీ ముందు మాట

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ రాసిన ముందుమాట ఆసక్తికరంగా మారింది. ‘అయాం జార్జియా-మై రూట్స్‌, మై ప్రిన్సిపుల్స్‌’ అనే ఈ పుస్తకం కేవలం ఆత్మకథ కాదని.. ఆమె ‘మన్‌ కీ బాత్‌ (మనసులో మాట)’ అని పేర్కొన్నారు. ‘ప్రధాని మెలోనీ ఆత్మకథ రాస్తుండడం నాకు సంతోషం కలిగిస్తోంది. 11 ఏళ్లుగా పలువురు ప్రపంచ నేతలతో కలిసి నడిచే అవకాశం నాకు కలిగింది. ఒక్కొక్కరిదీ ఒక్కో విధమైన జీవనయానం. కాలక్రమంలో అవి వ్యక్తిగత కథలను మించిన విస్తృతార్థాన్ని ఇస్తాయి. శతాబ్దాల తరబడి భిన్న సంస్కృతుల్లో నెలక్నొ విలువలను గుర్తుచేస్తాయి. తన పరిపూర్ణ జీవనంలో ప్రధాని మెలోనీకి ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఎదురై ఉంటాయి’ అని పేర్కొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 03:43 AM