Prime Minister Modi: జీ20 సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు మోదీ
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:26 AM
ప్రధాని మోదీ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహన్నె్‌సబర్గ్‌కు చేరుకున్నారు...
న్యూఢిల్లీ, నవంబరు 21: ప్రధాని మోదీ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహన్నె్‌సబర్గ్‌కు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శన బృందం మోదీకి ఘన స్వాగతం పలికింది. ‘ఐక్యత, సమానత్వం, స్థిరత్వం’ అనే ఇతివృత్తంతో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచ సమస్యలను చర్చించడానికి ఈ శిఖరాగ్ర సదస్సు ఓ కీలక వేదికని దక్షిణాఫ్రికా వెళ్లే ముందు మోదీ పేర్కొన్నారు. ‘వసుదైవ కుటుంబకం, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే మా దార్శనికతకు అనుగుణంగా భారత్ దృక్పథాన్ని సదస్సులో ప్రసంగిస్తా. ఆఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలి జీ-20 సదస్సు కాబట్టి ఇది చాలా ప్రత్యేకం అవుతుంది. ఈ సదస్సు సందర్భంగా జరగనున్న 6వ ఐబీఎ్‌సఏ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు, భాగస్వామ్య దేశాల నేతలతో చర్చించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.