Share News

Minister Uttam Remembers His Bond: మిగ్‌తో అనుబంధం

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:44 AM

మిగ్‌ యుద్ద విమానాలతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి, కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం నెమరువేసుకున్నారు....

Minister Uttam Remembers His Bond: మిగ్‌తో అనుబంధం

  • గుర్తు చేసుకున్న మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మిగ్‌ యుద్ద విమానాలతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి, కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం నెమరువేసుకున్నారు. భారత వాయుసేన (ఐఏఎ్‌ఫ)లో 62 ఏళ్లు సేవలందించిన మిగ్‌-21, మిగ్‌-23 విమానాలకు వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి సూపర్‌ సోనిక్‌ యుద్ధ విమానం ‘మిగ్‌’ను నడిపిన అనుభవాన్ని మంత్రి ఉత్తమ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఐఏఎ్‌ఫలో ఫైటర్‌ స్క్వాడ్రన్‌ పైలట్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సేవలందించిన సంగతి తెలిసిందే. మిగ్‌-21, మిగ్‌-23లను ఫైటర్‌ స్క్వాడ్రన్‌గా నడిపిన ఉత్తమ్‌.. అసోంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌బే్‌సలో వాటితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Updated Date - Sep 27 , 2025 | 02:44 AM