Minister Piyush Goyal: లబ్ధిని వినియోగదారులకు అందించండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:40 AM
వస్తు, సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు..
జీఎస్టీ తగ్గింపుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జీఎస్టీ తగ్గింపు లబ్ధిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద పన్ను సంస్కరణ అని మంత్రి పేర్కొన్నారు. దీన్ని ‘గేమ్ చేంజర్’గా అభివర్ణించారు. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దాదాపు అన్ని రంగాల్లో డిమాండ్ పెరుగుతుందన్నారు. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని గోయల్ చెప్పారు. స్వదేశీ వస్తువుల విక్రయాలను భారీగా ప్రోత్సహించా లని పరిశ్రమ వర్గాలను కోరారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడారు