Share News

Two Lakh Devotees Visit Sabarimala: శబరిమలకు ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:22 AM

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం దాదాపు 2 లక్షల భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి....

Two Lakh Devotees Visit Sabarimala: శబరిమలకు ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు

పథనంతిట్ట, నవంబరు 18: శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం దాదాపు 2 లక్షల భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పంబా నుంచి సన్నిధానం వరకూ దారి పొడవునా భక్తులు బారులుతీరారు. రద్దీని అదుపు చేయడానికి ఏర్పాటుచేసిన బ్యారికేడ్లపైకి చాలామంది ఎక్కగా, వీరిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. శబరిమలకు ఇంత పెద్దసంఖ్యలో భక్తులు రావడాన్ని ఇప్పటివరకూ చూడలేదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్‌ అన్నారు. భక్తులు స్పాట్‌ బుకింగ్‌ కోసం పంబాకు రావాల్సిన అవసరం లేకుండా నీలక్కల్‌లోనే ఏడు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శబరిమలకు ప్రవేశాన్ని రోజుకు లక్ష మంది పరిమితం చేస్తామన్నారు. అలాగే స్పాట్‌ బుకింగ్‌ 20 వేల మందికి మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Nov 19 , 2025 | 04:22 AM