Share News

Massive blast at Srinagar: శ్రీనగర్‌ నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద భారీ పేలుడు

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:23 AM

జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం రాత్రి పదకొండు గంటల 20 నిమిషాల సమయంలో భారీ పేలుడు సంభవించింది...

Massive blast at Srinagar: శ్రీనగర్‌ నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద భారీ పేలుడు

  • ఒకరు మృతి, 8మందికి గాయాలు

  • అమ్మోనియం నైట్రేట్‌ను పరిశీలిస్తుండగా పేలుడు

శ్రీనగర్‌, నవంబరు 14: జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం రాత్రి పదకొండు గంటల 20 నిమిషాల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. 8 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఢిల్లీ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులో నౌగామ్‌ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌ నుంచి ఫరీదాబాద్‌లో ఇటీవల స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల శాంపిల్స్‌ను పరిశీలిస్తుండగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 15 , 2025 | 04:23 AM