Maoist Leader Hidmas Mother: కొడుకా.. ఇంటికి రా..
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:07 AM
ఇప్పటికైనా ఇంటికిరా.. కొడుకా’ అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మాకు అతడి తల్లి కన్నీటి విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల...
మావోయిస్టు నేత హిడ్మాకు తల్లి వేడుకోలు
చర్ల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటికైనా ఇంటికిరా.. కొడుకా’ అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మాకు అతడి తల్లి కన్నీటి విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయశర్మ, హిడ్మా తల్లిని కలిసి కుమారుడిని లొంగిపోయేలా నచ్చజెప్పాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హిడ్మా తల్లి మాట్లాడిన ఓ వీడియో సందేశాన్ని మంగళవారం పోలీసులు విడుదల చేశారు. ‘‘బిడ్డా ఇంటికి వచ్చి సాధారణ జీ వితం గడుపు. లేదంటే నేనే అడవిబాట పడుతా. నీ కోసం కుటుంబమంతా ఎదురు చూస్తోంది’ అంటూ హిడ్మా తల్లి మాట్లాడింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సందేశంలో హిడ్మా తల్లి గోండు భాషలో మాట్లాడగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే, మరో మావోయిస్టు నేత దేవా తల్లితోనూ పోలీసులు ఇదే తరహా వీడియో విడుదల చేశారు. పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా, దేవా వరసకు అన్నదమ్ములవుతారు. దండకారణ్యంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో వీరిద్దరూ కీలక వ్యూహకర్తలుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.