Rahul Gandhi: భారత్‌లో తయారీ తగ్గుముఖం: రాహుల్
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:17 AM
ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలకు తయారీ రంగమే కీలకంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బుధవారం పేర్కొన్నారు...
న్యూఢిల్లీ, డిసెంబరు 17: ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలకు తయారీ రంగమే కీలకంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బుధవారం పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఆ రంగం తగ్గిపోతోందని పేర్కొన్నారు. జర్మనీ దేశంలోని మూనిక్‌లో బీఎండబ్ల్యూ ప్లాంటును సందర్శించిన అనంతరం పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన ఈమేరకు పేర్కొన్నారు. బీఎండబ్ల్యూ, భారత్‌కు చెందిన టీవీఎస్ సంస్థ కలిసి తయారుచేస్తోన్న టీవీఎస్ 450 సీసీ మోటార్‌సైకిల్‌ను చూడడం ప్రత్యేకంగా ఉందని వివరించారు. ప్రపంచంలోని 117 ప్రగతిశీల పార్టీలతో కూడిన ‘ప్రొగ్రెసివ్ అలయన్స్’ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అక్కడి భారతీయులతోపాటు ఆ దేశ మంత్రులను కూడా ఆయన కలుసుకొంటారు.