Manikarunika Dutta: యూకే నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోండి!
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:12 AM
భారత్‌లో పరిశోధనలు చేసే క్రమంలో ఆమె పరిమితికి మించి ఎక్కువ రోజులు విదేశాల్లో ఉన్నారని ఆ దేశ హోంశాఖ పేర్కొంది. మణికర్ణిక 12 ఏళ్లుగా యూకేలో ఉంటున్నారు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో అకడమిక్ బాధ్యతల్లో ఉన్నారు. అక్కడి ‘ఇన్‌డెఫినిట్ లీవ్ టు రిమైన్(ఐఎల్‌ఆర్)’ నిబంధనల ప్రకారం..
చరిత్రకారిణి మణికర్ణికకు ఆ దేశ హోంశాఖ ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 16: భారత చరిత్రకారిణి మణికర్ణిక దత్తా యూకే నుంచి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నారు. భారత్‌లో పరిశోధనలు చేసే క్రమంలో ఆమె పరిమితికి మించి ఎక్కువ రోజులు విదేశాల్లో ఉన్నారని ఆ దేశ హోంశాఖ పేర్కొంది. మణికర్ణిక 12 ఏళ్లుగా యూకేలో ఉంటున్నారు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో అకడమిక్ బాధ్యతల్లో ఉన్నారు. అక్కడి ‘ఇన్‌డెఫినిట్ లీవ్ టు రిమైన్(ఐఎల్‌ఆర్)’ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఐఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకుంటే 10ఏళ్ల వ్యవధిలో యూకే బయట 548 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ, దత్తా 691 రోజులుగా విదేశంలో ఉంటున్నారని, దీని కారణంగా ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని యూకే హోంశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో.. ‘మీరు యూకేను తప్పనిసరిగా వీడి వెళ్లాలి. స్వచ్ఛందంగా వెళ్లకుంటే.. యూకేకు మళ్లీ రాకుండా పదేళ్ల పాటు నిషేధం విధిస్తాం’ అని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..