Engine Oil Drinker: ఇంజన్ ఆయిలే ఆహారం!
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:55 AM
సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీనో, దోశనో.. మరేదైనా అల్పాహారమో తింటారు. కానీ.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ మాత్రం చాలా స్పెషల్..
రోజూ ఏడెనిమిది లీటర్ల వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగుతూ 33 ఏళ్లుగా దానితోనే బతుకుతున్న ‘ఆయిల్ కుమార్’
బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీనో, దోశనో.. మరేదైనా అల్పాహారమో తింటారు. కానీ.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ మాత్రం చాలా స్పెషల్..! బ్రేక్‌ఫాస్ట్ కింద ఉదయాన్నే ఒక బాటిల్ వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగితే గానీ ఆయన రోజు మొదలవదు..! ఉదయం టీతోపాటు రోజు మొత్తమ్మీద ఆయన ఏడు, ఎనిమిది లీటర్ల ఇంజన్ ఆయిల్ లాగించేస్తాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం...! ఒకటి కాదు రెండు కాదు.. 33 ఏళ్లుగా ఆయన ఇలాగే ఇంజన్ ఆయిల్ తాగి బతుకుతున్నాడు. వాహనాలకు ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు వచ్చే వేస్ట్ ఆయిల్‌ను తాగుతూ ‘ఆయిల్ కుమార్’గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏడాదిలో సగంరోజులు అయ్యప్ప స్వామి దీక్షలో గడిపే కుమార్.. ఇంజన్ ఆయిల్ తాగుతున్నా ఎప్పుడూ అనారోగ్యం పాలవలేదు. ఆస్పత్రులకు వెళ్లలేదు. దానికి అయ్యప్పస్వామిపై తనకున్న విశ్వాసమే కారణమని కుమార్ చెబుతున్నాడు.