Mamata Warns BJP: నన్ను టార్గెట్ చేస్తే మీ పునాదులు కదిలిస్తా
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:07 AM
రాష్ట్రంలో తనను టార్గెట్ చేస్తే, దేశంలో బీజేపీ పునాదులు కదిలిస్తానంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమత వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని కోట్ల రూపాయాలు ఖర్చు....
బొన్‌గావ్, నవంబర్ 25: రాష్ట్రంలో తనను టార్గెట్ చేస్తే, దేశంలో బీజేపీ పునాదులు కదిలిస్తానంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమత వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టినా, కేంద్ర సంస్థలన్నింటినీ రంగంలోకి దించినా తనను ఓడించలేదని అన్నారు. ఽథాకూర్ నగర్‌లో మంగళవారం ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో మతువా మెజార్టీ ప్రాంతాల్లోని ఓటర్లను సీఏఏ పేరుతో విదేశీయులుగా ప్రకటించి, వెంటనే జాబితా నుంచి తొలగించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 36మంది ప్రాణాలు తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.