బీజేపీ పాలనలో పెరిగిన బ్యాంకు మోసాలు
ABN , Publish Date - May 31 , 2025 | 06:16 AM
గత 11 ఏళ్లలో బ్యాంకు మోసాలు భారీగా పెరిగాయని, దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం అని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత కూడా నకిలీ 500 నోట్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు.
న్యూఢిల్లీ, మే 30: దేశంలో గత 11 ఏళ్లలో బ్యాంకు మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని.. దీనికి బీజేపీ పాలనే కారణమంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోసాలు, కుతంత్రాలతోనే మోదీ సర్కారు నడుస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. ‘గత 11 ఏళ్ల మోదీ పాలనలో రూ.6,36,999 కోట్ల బ్యాంకు మోసాలు జరిగాయి. ఇది 416ు పెరుగుదల. నోట్ల రద్దు తర్వాత కూడా.. గత ఆరేళ్లలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 291 శాతం పెరిగింది. అందులోనూ ఈ ఏడాదే ఇంకా అత్యధికం..’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. .