Minister Mallareddy: చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారు
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:18 AM
పీ సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు..
తెలంగాణ ఆగమాగం: మల్లారెడ్డి
తిరుమల, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఆగం ఆగం అవుతోందన్నారు. అందుకే కేసీఆర్ వస్తే మళ్లీ పాతరోజులు వస్తాయని, ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని శ్రీవారిని కోరినట్టు చెప్పారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.