Share News

Bihar Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్‌ సమాయత్తం

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:11 AM

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేయడానికి ఎంఐఎం ఏర్పాట్లు చేసుకుంటోంది. గత శాసనసభ...

Bihar Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్‌ సమాయత్తం

  • 30 నుంచి 35 స్థానాల్లో పోటీకి ఏర్పాట్లు

  • నేటి నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ ‘సీమాంచల్‌ న్యాయయాత్ర’

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేయడానికి ఎంఐఎం ఏర్పాట్లు చేసుకుంటోంది. గత శాసనసభ(2020)ఎన్నికల్లో 25 స్థానాలకు పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్‌ ఈసారి అదనంగా మరో పది స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించాలని చూస్తోంది. బిహార్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీమాంచల్‌లో నివసిస్తున్న ముస్లిం మైనారిటీల ఓట్లతో విజయం సాధించవచ్చనే ధీమాతో మజ్లిస్‌ ఆ ప్రాంతంలోని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పోటీలో దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు బిహార్‌లోని కిషన్‌గంజ్‌ నుంచి ‘సీమాంచల్‌ న్యాయ యాత్ర’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు మజ్లిస్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Sep 24 , 2025 | 03:11 AM