Share News

Molestation: మహారాష్ట్రలో హెచ్‌ఐవీ బాధితురాలిపై రేప్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 06:12 AM

మహరాష్ట్రలోని లాతూర్‌లో హెచ్‌ఐవీ బాధితుల సంరక్షణ కేంద్రంలో తల దాచుకున్న బాలిక(16)పై అందులోని ఓ ఉద్యోగి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Molestation: మహారాష్ట్రలో హెచ్‌ఐవీ బాధితురాలిపై రేప్‌

లాతూర్‌, జూలై 26: మహరాష్ట్రలోని లాతూర్‌లో హెచ్‌ఐవీ బాధితుల సంరక్షణ కేంద్రంలో తల దాచుకున్న బాలిక(16)పై అందులోని ఓ ఉద్యోగి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల అనారోగ్యంతో పడిపోతే సంరక్షణ కేంద్రం నిర్వాహకులు ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె 4 నెలల గర్భవతి అని నిర్ధారించిన వైద్యులు.. తన సమ్మతి తీసుకోకుండానే గర్భస్రావం చేశారు. దీనిపై ఆ బాలిక సంరక్షణ కేంద్రం ఫిర్యాదుల పెట్టెలో చేసిన ఫిర్యాదు ప్రతినీ కేంద్రం యాజమాన్య ప్రతినిధులు చింపేశారు. అయితే, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంస్థ వ్యవస్థాపకులు రవి బాపట్లె, సూపరింటెండెంట్‌ రచ్నా బాపట్లె, ఉద్యోగులు అమిత్‌ మహాముని, పూజలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Jul 27 , 2025 | 06:14 AM