Vijay Karur Stampede: విజయ్‌పై కేసు ఎందుకు పెట్టలేదు!
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:07 AM
తమిళనాడులోని కరూర్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది..
కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
చెన్నై, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కరూర్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధినేత విజయ్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. కళ్లెదుట అంతమంది చనిపోతున్నా పట్టించుకోకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతారా..? ఇదేం పార్టీ.. ఇదేం విధానం...? అంటూ మండిపడింది. ఈ ఘటన పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని, ఆ పార్టీ అధ్యక్షుడికి అసలు నాయకత్వ లక్షణాలే లేవనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విజయ్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. 41 మంది చావుకు, 60 మంది గాయపడడానికి కారణమైన ఈ దుర్ఘటన పట్ల ప్రేక్షకపాత్ర వహించలేమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు తమిళనాడు ఉత్తర విభాగ ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.