PM Modi: గొప్ప ఉప రాష్ట్రపతిగా నిలుస్తారు: మోదీ
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:34 AM
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినసీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు..
న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి, సెప్టెంబరు 9: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినసీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సమాజసేవకు, పేదలు, అణగారినవర్గాలవారి సాధికారతకు రాధాకృష్ణన్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఒక గొప్ప ఉపరాష్ట్రపతిగా నిలిచి.. రాజ్యాంగవిలువలను మరింత బలోపేతం చేస్తారన్న నమ్మకం తనకుందని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ గెలుపు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో చరిత్రాత్మక విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించిన రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం స్ఫూర్తిదాయకమని, ఆయన నిబద్ధతకు సరైన గుర్తింపు అని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. సీపీ రాధాకృష్ణన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా, మంత్రి లోకేశ్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.