Internet Security: 1600 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్!
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:04 AM
ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద భద్రతా ముప్పు బయటపడింది. 16 బిలియన్ల(16 వందల కోట్లు)కు పైగా పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ, జూన్ 20: ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద భద్రతా ముప్పు బయటపడింది. 16 బిలియన్ల(16 వందల కోట్లు)కు పైగా పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వ్యక్తిగత డేటాకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లీక్ అయిన డేటాతో స్కామ్‌లు చేయడానికి, ఖాతాలను హ్యాక్ చేయడానికి, గుర్తింపును దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని సైబర్ న్యూస్, ఫోర్బ్స్ కథనాలు పేర్కొన్నాయి. ఆ డేటా పాతది కాదని, కొత్తది అని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ఫోస్టీలర్లుగా పిలిచే ఓ రకమైన మాల్‌వేర్‌తో ఓ పద్ధతి ప్రకారం ఈ డేటాను కొట్టేశారని వెల్లడించారు. ఆ మాల్‌వేర్‌ను ప్రజల ఎలకా్ట్రనిక్ పరికరాల్లోకి హ్యాకర్లు జొప్పించి వారి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను తస్కరించారని తెలిపారు. గూగుల్, ఫేస్‌బుక్ తదితర ప్లాట్‌ఫాంల నుంచి చోరీ చేసిన డేటాను హ్యాకర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.