Share News

Political Funding,: బీజేపీకి టాటా ట్రస్టు నుంచి రూ.757 కోట్లు

ABN , Publish Date - Dec 04 , 2025 | 03:56 AM

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి విరాళాల వరద పోటెత్తింది. టాటా గ్రూప్‌ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌...

Political Funding,: బీజేపీకి టాటా ట్రస్టు నుంచి రూ.757 కోట్లు

  • 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా అందిన విరాళాలు

  • రూ.10 కోట్ల చొప్పున బీఆర్‌ఎస్‌, వైసీపీలకు

న్యూఢిల్లీ, డిసెంబరు 3: గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి విరాళాల వరద పోటెత్తింది. టాటా గ్రూప్‌ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌(పీఈటీ) నుంచి 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీకి రూ.757 కోట్లు అందాయి. ఆ ఎన్నికల సమయంలో మొత్తం 10 రాజకీయ పార్టీలకు పీఈటీ రూ.914 కోట్లను విరాళాలుగా అందించగా.. దీనిలో 83ు నిధులు ఒక్క బీజేపీకే అందడం విశేషం. పీఈటీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ రూ.77.3 కోట్లు అందుకుంది. బీజేపీ, కాంగ్రె్‌సతోపాటు పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రె్‌సపార్టీ(టీఎంసీ), ఏపీకి చెందిన వైసీపీ, మహారాష్ట్రకు చెందిన శివసేన, ఒడిశాకు చెందిన బీజేడీ, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌, బీహార్‌కు చెందిన ఎల్జేపీ, జేడీయూ, తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీలకు రూ.10 కోట్ల చొప్పున పీఈటీ విరాళాలుగా అందించింది. ఇదిలా ఉండగా, 2024-25 సంవత్సరంలో వివిధ ట్రస్టులు, సంస్థల నుంచి కాంగ్రె్‌సకు మొత్తం రూ.517.37 కోట్లు విరాళాలుగా అందాయి. ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.216.33 కోట్లు, ఏబీ జనరల్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.15 కోట్లు, న్యూ డెమొక్రటిక్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.5 కోట్లు, జన్‌ కల్యాణ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.9.5 లక్షల చొప్పున కాంగ్రె్‌సకు విరాళాలుగా అందాయి.

Updated Date - Dec 04 , 2025 | 03:56 AM