Tamil Nadu: మనిషి రూపంలో.. గొర్రెపిల్ల
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:48 AM
తమిళనాడు రాష్ట్రం కళ్లకుర్చి జిల్లాలో మనిషి రూపంతో పుట్టిన గొర్రెపిల్ల అందరినీ ఆశ్చర్యపరచింది.
తమిళనాడు రాష్ట్రం కళ్లకుర్చి జిల్లాలో మనిషి రూపంతో పుట్టిన గొర్రెపిల్ల అందరినీ ఆశ్చర్యపరచింది. సేందమంగళం గ్రామంలోని ఆనందన్‌కు చెందిన గొర్రె ఆదివారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిల్లో ఒకటి సాధారణంగానే ఉండగా, మరొకదాని ముఖం, వీపు భాగం, మరికొన్ని అవయవాలు మనిషిని పోలి ఉన్నాయి. పుట్టిన కొద్దిసేపటికే ఈ గొర్రె పిల్ల చనిపోయినా.. ఈ విషయం అంతటా వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని గొర్రెపిల్ల కళేబరాన్ని చూశారు. గొర్రెపిల్ల మృతదేహానికి ఆనందన్ కుటుంబీకులు పూజలు చేసి, అంత్యక్రియలు చేశారు.
- (చెన్నై, ఆంధ్రజ్యోతి)