Share News

Lalu Family Rift: లాలూ కుటుంబంలో బిహార్‌ ఫలితాల చిచ్చు

ABN , Publish Date - Nov 16 , 2025 | 06:51 AM

బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబంలో చిచ్చు రేపాయి. లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.

Lalu Family Rift:  లాలూ కుటుంబంలో బిహార్‌ ఫలితాల చిచ్చు

  • రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన లాలూ కుమార్తె రోహిణి

  • కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకుంటున్నట్లు వెల్లడి

పట్నా, నవంబరు 15: బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబంలో చిచ్చు రేపాయి. లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అంతేకాదు కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకుంటున్నట్లు ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సంజయ్‌ యాదవ్‌, రమీజ్‌ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విమర్శలన్నింటికీ తాను బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌.. తేజస్వీ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించినందుకు తేజస్వీ, సంజయ్‌ యాదవ్‌, రమీజ్‌ తనను తిట్టి, కొట్టడమే కాకుండా ఇంటి నుంచి గెంటేశారని రోహిణి ఆరోపించారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన సోదరుడైన తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని రోహిణి తప్పుబట్టారు. అయితే ఇటీవలి ఎన్నికల సమయంలో మాత్రం ఆమె తన మరో సోదరుడైన తేజస్వీ తరపున ప్రచారం చేశారు. వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన రోహిణి ఆచార్య లాలూ స్నేహితుడైన విజయ్‌సింగ్‌ కుమారుడు సమరేశ్‌సింగ్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. లాలూకు కిడ్నీ ఇవ్వడం ద్వారా రోహిణి గతంలో వార్తల్లో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సరన్‌ నుంచి ఆర్జేడీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Updated Date - Nov 16 , 2025 | 06:53 AM