Share News

Ladakh DGP: వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:10 AM

లద్దాఖ్‌ ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని.. దీనిపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారని డీజీపీ ఎస్డీ సింగ్‌...

Ladakh DGP: వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: లద్దాఖ్‌ ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని.. దీనిపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారని డీజీపీ ఎస్డీ సింగ్‌ జమ్వాల్‌ తెలిపారు. వాంగ్‌చుక్‌తో సంబంధాలు కలిగి ఉన్న పాక్‌ గూఢచారి (పీఐఓ)ని ఇటీవలే అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వాంగ్‌చుక్‌ గతంలో పాక్‌, బంగ్లాదేశ్‌లలో పర్యటించారన్నారు. శనివారం లేహ్‌లో జరిగిన మీడియా సమావేశంలో లద్దాఖ్‌ డీజీపీ జమ్వాల్‌ మాట్లాడుతూ.. ‘లేహ్‌లో అల్లర్ల వెనక వాంగ్‌చుక్‌ కీలక వ్యక్తి. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఓ పాక్‌ గూఢచారిని ఇటీవలే అరెస్టు చేశాం. అతడు వాంగ్‌చుక్‌తో సంప్రదింపులు జరిపాడు. దీనికి సంబంధించిన రికార్డులున్నాయి. ఆయన వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. వీటిపై దర్యాప్తు జరుపుతున్నాం’ అని వివరించారు.

Updated Date - Sep 28 , 2025 | 01:10 AM