Mallikarjun Kharge: ఎన్డీయేది నైతికంగా పరాజయమే
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:33 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ సంఖ్యాపరంగా గెలిచినా నైతికంగా, రాజకీయంగా మాత్రం ఓటమి పాలైందని కాంగ్రెస్ ...
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఖర్గే
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ సంఖ్యాపరంగా గెలిచినా నైతికంగా, రాజకీయంగా మాత్రం ఓటమి పాలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కేవలం ఎన్నిక మాత్రమే కాదని, అంతకుమించిన సైద్ధాంతిక యుద్ధమని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా నిలబడ్డాయన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తారని, ప్రతిపక్షానికి సమాన గౌరవం, అవకాశం ఇస్తారని, అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గరని ఆశిస్తున్నట్లు తెలిపారు.