Share News

Couple Marries in ICU: పెళ్లి పీటలపై కాదు.. ఐసీయూలో వివాహం!

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:28 AM

పెళ్లి అంటే అదొక పండగ, ఎన్నో కలలు, మరెన్నో కోరికలు ఉంటాయి. కేరళలోని అలప్పుళకు చెందిన అవనికి కూడా అలాంటి ఉత్సాహంతోనే...

Couple Marries in ICU: పెళ్లి పీటలపై కాదు.. ఐసీయూలో వివాహం!

కొచ్చి, నవంబరు 21: పెళ్లి అంటే అదొక పండగ, ఎన్నో కలలు, మరెన్నో కోరికలు ఉంటాయి. కేరళలోని అలప్పుళకు చెందిన అవనికి కూడా అలాంటి ఉత్సాహంతోనే ఆ రోజు ఉదయం మొదలైంది. తంబోలికి చెందిన శరణ్‌తో శుక్రవారం మధ్యాహ్నం వివా హం జరగాల్సి ఉండగా.. అలంకరణ కోసం కుమారకోమ్‌ బయలుదేరింది. అయితే మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై కొచ్చిలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. అయితే, పెళ్లి వాయిదా వేయడం ఎందుకని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు ముహూర్త సమయంలోనే ఆస్పత్రి బెడ్‌పైనే పెళ్లి నిర్వహించాలనుకున్నారు. బెడ్‌పైనే ఉన్న అవనికి కుటుంబీకుల సమక్షంలో వరుడు తాళి కట్టాడు.

Updated Date - Nov 22 , 2025 | 04:28 AM