Char Dham Yatra: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం
ABN , Publish Date - May 03 , 2025 | 04:38 AM
ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం 7గంటలకు తెరుచుకున్నాయి. వివిధ దేశాల నుంచి తెప్పించిన పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించి 12,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కేదార్‌నాథ్, మే 2: ఛార్‌ధామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం 7గంటలకు తెరుచుకున్నాయి. వివిధ దేశాల నుంచి తెప్పించిన 108 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. శుక్రవారం ఉత్తరాఖండ్ సీఎం ధామీతో పాటు 12వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు గత నెల 30న తెరుచుకోగా.. బద్రినాఽథ్ ఆలయ ద్వారాలు ఈ నెల 4 నుంచి తెరుచుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి..