Karunesh Bajaj: ఏబీసీ చైర్మన్‌గా కరుణేష్ బజాజ్
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:53 AM
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబీసీ చైర్మన్‌గా ఐటీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్స్ ..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా ఐటీసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్స్) కరుణేష్ బజాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన పాతికేళ్లకు పైగా ఐటీసీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐటీసీ పేరు ప్రఖ్యాతులు, విశ్వసనీయతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పలు బ్రాండ్లు దేశవ్యాప్తంగా విస్తృత గుర్తింపు పొందడంలో ఆయన కృషి ఉంది. ఐటీసీలో చేరకముందు భారతీ రిటైల్ లిమిటెడ్ (భారతీ-వాల్‌మార్ట్ జేవీ)లో ‘హెడ్ ఆఫ్ బ్రాండ్స్’గా పనిచేశారు. మార్కెటింగ్ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న కరుణేష్ బజాజ్.. తన పదవీ కాలంలో ఏబీసీ పురోగతికి మార్గదర్శిగా నిలుస్తారని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ ఆదిల్ కసద్, ప్రతినిధులు పేర్కొన్నారు. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా బెన్నెట్ అండ్ కోల్‌మన్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోహిత్ జైన్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.