Karnataka Politics: ఎమ్మెల్యే పదవికి కర్ణాటక మంత్రి రాజీనామా
ABN , Publish Date - May 03 , 2025 | 04:26 AM
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బసనగౌడ యత్నాళ్ సవాల్‌ను స్వీకరించిన మంత్రి శివానంద పాటిల్, ఆయనపై పోటీకి సిద్ధమన్నారు. మహ్మద్ ప్రవక్తపై యత్నాళ్ చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం కర్ణాటక రాజకీయాలను వేడెక్కించింది.
యత్నాళ్‌పై పోటీకి సిద్ధమని శివానంద పాటిల్ ప్రకటన
బెంగళూరు, మే 2(ఆంధ్రజ్యోతి): బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ విసిరిన సవాల్‌ను కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ స్వీకరించారు. ఎమ్మెల్యే పదవికి శుక్రవారం రాజీనామా చేసి, యత్నాళ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. మహ్మద్ ప్రవక్త పైగంబర్ గురించి బసనగౌడ పాటిల్ యత్నాళ్ చేసిన వ్యాఖ్యలను ఇటీవల శివానంద పాటిల్ తప్పుబట్టారు. దీనిపై రెండు రోజుల క్రితం యత్నాళ్ స్పందించారు. శివానంద పాటిల్...‘పాటిల్’ సామాజికవర్గానికి చెందినవారు కాదని, రాజకీయ లబ్ధికోసమే పెట్టుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి శుక్రవారంలోగా రాజీనామా చేసి, తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి..