Share News

Karnataka CM: గందరగోళానికి అధిష్ఠానం తెరదించాలి

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:06 AM

కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై నెలకొన్న గందరగోళానికి పార్టీ అధిష్ఠానం తెరదించాలని సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు......

Karnataka CM: గందరగోళానికి అధిష్ఠానం తెరదించాలి

  • కర్ణాటక సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై నెలకొన్న గందరగోళానికి పార్టీ అధిష్ఠానం తెరదించాలని సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధిష్ఠానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అధిష్ఠానం పెద్దలను కలసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీకి కర్ణాటకలో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలన పూర్తయింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం మార్పుపై చర్చ మొదలైంది. తాజా పరిణామాలపై డీకే శివకుమార్‌ కనకపురలో మీడియాతో మాట్లాడారు. పవర్‌ షేరింగ్‌ గురించి 2023లో పార్టీలోని నలుగురైదుగురు ముఖ్యుల సమక్షంలో ఒప్పందం జరిగిందని వెల్లడించారు. అది తమ మధ్య జరిగిన రహస్య ఒప్పందమని, బహిర్గతం చేయలేమని తెలిపారు.

Updated Date - Nov 26 , 2025 | 04:06 AM