Karnataka politics: ఢిల్లీలో ఎవరికి వారే!
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:58 AM
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని, సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు...
ప్రధానిని ఒంటరిగా కలిసిన ముఖ్యమంత్రి
ఖర్గేతో డీకే, సిద్దూ వేర్వేరుగా సంప్రదింపులు
బెంగళూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని, సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. 40 నిమిషాలపాటు చర్చించారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ 3రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా, సీఎం ఒంటరిగానే ప్రధానిని కలవడం గమనార్హం. డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి 3 గంటలకు బెంగళూరు బయల్దేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఢిల్లీలో మూడు రోజులు గడిపిన డీకే శివకుమార్, తన తమ్ముడు సురేశ్‌తో కలసి ఆదివారం ఖర్గేతో భేటీ అయ్యారు. కాగా, సీఎం సిద్దరామయ్య శనివారం మధ్యాహ్నం రాహుల్‌గాంధీని కలిసిన విషయం తెలిసిందే. అప్పటికే ఢిల్లీకి డీకే శివకుమార్ కూడా చేరుకున్నారు. అయినా రాహుల్‌గాంధీని, ఖర్గేని సీఎం ఒంటరిగానే కలిశారు. మొత్తంగా ముుఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మూడు రోజులుగా ఢిల్లీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు.