Share News

Supreme Court: 52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:16 AM

భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ నియమితులయ్యారు. జూన్‌ 14న ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.

 Supreme Court: 52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

14న ప్రమాణ స్వీకారం

కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ నియమితులయ్యారు. వచ్చే నెల 14న ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్‌ గవాయ్‌ను 52వ సీజేఐగా ఎంపిక చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ని తదుపరి సీజేఐగా నియమించినట్లు తెలిపింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు (14న) జస్టిస్‌ గవాయ్‌ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 05:16 AM