లలిత్ మోదీకి ఝలక్
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:34 AM
భారతదేశం నుంచి పరారైనా ఆర్థిక నేరగాడు, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వనువాటు దేశ ప్రధానమంత్రి జోతం నపట్ ఝలక్ ఇచ్చారు. లలిత్ మోదీకి జారీ చేసిన పాస్‌పోర్టును రద్దు చేయాలని సిటిజన్‌షిప్ కమిషన్‌ను సోమవారం ఆయన ఆదేశించారు.

పాస్‌పోర్టు రద్దుకు వనువాటు ప్రధాని ఆదేశం
పోర్ట్ విలా, మార్చి 10: భారతదేశం నుంచి పరారైనా ఆర్థిక నేరగాడు, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వనువాటు దేశ ప్రధానమంత్రి జోతం నపట్ ఝలక్ ఇచ్చారు. లలిత్ మోదీకి జారీ చేసిన పాస్‌పోర్టును రద్దు చేయాలని సిటిజన్‌షిప్ కమిషన్‌ను సోమవారం ఆయన ఆదేశించారు. అలాగే పౌరసత్వం కోసం లలిత్ మోదీ చేసిన దరఖాస్తును ఆమోదించవద్దని తమ దేశ అధికారులను ఆయన నిర్దేశించారు.
లలిత్ మోదీపై అంతర్జాతీయ మీడియాలో వచ్చిన తాజా కథనాలతో అప్రమత్తమై తాను ఈ ఆదేశాలను జారీ చేసినట్టు పేర్కొన్నారు. నేరస్థుల అప్పగింత ఉచ్చు నుంచి తప్పించుకునేందుకే లలిత్ మోదీ తమ దేశంలో పాస్‌పోర్టు, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. ‘దరఖాస్తుదారులు చట్టపరమైన కారణాలతోనే మా దేశంలో పౌరసత్వం పొందాలి. అంతేగానీ నేరస్థుల అప్పగింత ఉచ్చు నుంచి తప్పించుకునేందుకు కాదు’ అని వివరించారు.