Vehicle Accident in Kashmir: కశ్మీర్‌లో వాహనం బోల్తా.. రాష్ట్ర జవాన్ మృతి
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:50 AM
జమ్మూకశ్మీర్‌లో ఓ సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన జవాను మృతి చెందాడు.
కారేపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లో ఓ సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన జవాను మృతి చెందాడు. కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన బానోత్ అనిల్ (30) సోమవారం గస్తీ నిర్వహించే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఆర్మీ అధికారులు అనిల్ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనిల్‌కు భార్య రేణుక, ఎనిమిది నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన అనిల్ 20 రోజుల కిత్రమే తిరిగి విధుల్లో చేరాడు. ఈ నెల 10వ తేదీ ఆదివారం అనిల్ పుట్టిన రోజు కాగా.. ఆ మరునాడే మృతి చెందడం బాధాకరం. అనిల్ మృతదేహాన్ని మంగళవారం విజయవాడ విమానాశ్రయానికి తీసుకురానన్నుట్లు సమాచారం.