Share News

Red Fort Blast Linked to Wider Conspiracy: టర్కీ నుంచి కుట్ర

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:17 AM

పాకిస్థాన్‌ లో కూర్చుని కుట్రలు చేసి భారత్‌లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు.. తాజాగా రూటు మార్చారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్‌ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠాకు..

Red Fort Blast Linked to Wider Conspiracy: టర్కీ నుంచి కుట్ర

  • ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహ్మద్‌ సంస్థ కార్యకలాపాలు

  • ఫరీదాబాద్‌ ఉగ్రవాదులకు అక్కణ్నుంచే ఆదేశాలు.. భారత్‌లో ఒకేసారి 200 బాంబు పేలుళ్లకు కుట్ర

  • దీపావళికే అమలు చేయాలని ప్రణాళిక.. అది తప్పడంతో డిసెంబరు 6న దాడికి పన్నాగం

  • ఉమర్‌ నబీ జరపాలని నిర్ణయం.. సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి

  • పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్‌ ముజమ్మిల్‌ వెల్లడి!.. హరియాణాలో మరో కారు గుర్తింపు

  • భూటాన్‌ నుంచి తిరిగొచ్చిన ప్రధాని మోదీ.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ

న్యూఢిల్లీ, నవ ంబరు 12: పాకిస్థాన్‌ లో కూర్చుని కుట్రలు చేసి భారత్‌లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు.. తాజాగా రూటు మార్చారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్‌ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠాకు.. జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తిమంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తేలింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవటంతో డిసెంబర్‌ 6న, జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్‌ సిందూర్‌ లో భాగంగా పాకిస్థాన్‌ ఉగ్ర స్థావరాలన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేయటంతో అక్కడి ఉగ్ర ముఠాలు సురక్షితమైన కొత్త స్థావరాన్ని వెతుక్కున్నాయి. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్‌గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్యదేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్యదేశాలన్నింటిపై దాడిచేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండటంతో టర్కీపై భారత్‌ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాది ఒకరు టెలిగ్రాంలో రెండు గ్రూపుల ద్వారా ఫరీదాబాద్‌ కేసులో అరెస్టయిన వైద్యులను ఉగ్రవాదంవైపు ఆకర్షించినట్లు నిఘా వర్గాలు ఆధారాలు సంపాదించాయి. ‘ఫర్జాందాన్‌ ఇ దారుల్‌ ఉలూమ్‌ (దీయోబంద్‌), ఉమర్‌ బిన్‌ ఖత్తబ్‌‘ అనే టెలిగ్రాం గ్రూపుల ద్వారా వీరు తరుచూ సంభాషించుకునేవారని గుర్తించారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేసిన వైద్యులను ఉగ్రవాదంపై మళ్లించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న షోపియాన్‌కు చెందిన మత గురువు ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ ఆగాహ్‌ ఈ టెలిగ్రాం గ్రూపుల ద్వారానే టర్కీలోని జైషే మహ్మద్‌ ఉగ్రవాదితో సంభాషించినట్లు భావిస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కశ్మీర్‌ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయాలని పిలుపునిస్తూ మెళ్లిగా భారత్‌పై ఉగ్రదాడులు చేసేలా వారిని పురికొల్పినట్లు గుర్తించారు. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్‌ నబీ కూడా ఈ గ్రూపుల్లో సభ్యుడేనని భావిస్తున్నారు.


ఇమామ్‌ ఇర్ఫాన్‌, నబీలు రెండుసార్లు టర్కీ వె ళ్లి వారి జైషే హ్యాండ్లర్‌ను కలిసినట్లు నిఘా వరాల సమాచారం. ఆ తర్వాతే ఫరీదాబాద్‌ మాడ్యూల్‌ విస్తరణ వేగం పుంజుకుందని పేర్కొన్నాయి. మరింత మందిని ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు, దాడులకు కావాల్సిన సరంజామాను సమకూర్చుకునేందుకు టర్కీ హ్యండ్లర్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఉగ్ర డాక్టర్లను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసేలా ప్రోత్సహించినట్లు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా డాక్టర్‌ ముజమ్మిల్‌ అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో చేరగా, డాక్టర్‌ అదీల్‌ సహరాన్‌పూర్‌లో ఉద్యోగంలో చేరాడు. వీరంతా ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు అనేదానిపై దర్యాప్తు అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు.

ముంబై దాడుల తరహాలో పేలుళ్లకు కుట్ర..

ఈ ఉగ్రవాద ముఠా దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ముంబైలో మెరుపు దాడులకు పాల్పడిన తరహాలో దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌లో దాదాపు 200 చోట్ల ఏకకాలంలో అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని ప్రణాళిక వేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

దీపావళికే దాడికి ప్రణాళిక

పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్‌ ముజమ్మిల్‌ ఉగ్ర కుట్ర గురించి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గత దీపావళి రోజునే ఢిల్లీలో దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు అతడు తెలిపాడు. అందుకోసం ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్‌, కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌, గౌరీశంకర్‌ ఆల యం తదితర చోట్ల రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించాడని తెలిసింది. ఈ పేలుళ్లకు గత జ నవరి నుంచే ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. దీపావళి ప్రణాళిక తప్పిపోవటంతో డిసెంబరు 6న (బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు) దేశవ్యాప్తంగా దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు ముజమ్మిల్‌ తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ లో భీకర దాడులకు కూడా కుట్ర చేసినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. ఎర్రకోట బాంబుదాడికి కారణమైన ఉమర్‌ నబీ డిసెంబరు 6న దాడికి సిద్ధమయ్యాడని, అనుకోని విధంగా ఫరీదాబాద్‌ మాడ్యూల్‌ పోలీసులకు దొరికిపోవటంతో ముందుగానే ఎర్రకోట వద్ద దాడి చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఉమర్‌ నబీ ఆత్మాహుతి దాడికి ముందు రామ్‌లీలా మైదాన్‌ సమీపంలోని ఓ మసీదుకు వెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం వెల్లడించారు.


1.jpg

బాధితులకు ప్రధాని పరామర్శ

కారు బాంబు దాడిలో గాయపడి ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ బుధవారం పరామర్శించారు. భూటాన్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయన నేరుగా ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు. ‘ఆస్పత్రికి వెళ్లి బాధితులను కలిశాను. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాంబు దాడి కుట్ర కారకులను చట్టం ముందు నిలబెడతాం’ అని పేర్కొన్నారు.

నబీ మరో కారు లభ్యం

ఉమర్‌ నబీకి చెందిన మరో కారును పోలీసులు బుధవారం గుర్తించారు. ఎరుపు రంగు ఎకోస్పోర్ట్‌ కారు (డీఎల్‌10సీకే0458)ను ఫరీదాబాద్‌ జిల్లా ఖందవాలీలో సీజ్‌ చేశారు. ఈ కారులో కూడా బాంబులు అమర్చారేమోనన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు హరియాణా, యూపీ పోలీసులను అలర్ట్‌ చేసి బుధవారం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు హరియాణా పోలీసులు ఖందవాలీ గ్రామంలో దానిని గుర్తించటం, అందులో బాంబులు లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

1.jpg

పరారీలో మరో ఉగ్ర వైద్యుడు నిసారుల్‌ హాసన్‌!

అల్‌ ఫలాహ్‌ వర్సిటీలో పోలీసుల దర్యాప్తు సందర్భంగా మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. వర్సిటీలో పనిచేస్తున్న మరో ఉగ్ర వైద్యుడు నిసారుల్‌ హాసన్‌ పరారీలో ఉన్నట్టు గుర్తించారు. శ్రీనగర్‌లోని శ్రీమహరాజా హరిసింగ్‌ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో నిసారుల్‌ హాసన్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు బయటపడింది. దీనితో 2023 నవంబర్‌లో నిసారుల్‌ హాసన్‌ను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఉద్యోగం నుంచి తొలగించారు. తర్వాత నిసారుల్‌ అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలోని వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరాడు.


11 రోజుల క్రితమే కారు కొని.. బాంబులతో సగం ఢిల్లీ చుట్టేసి!

ఎర్రకోట సమీపంలో భారీ పేలుడుకు కారణమైన హుండై ఐ20 పాత కారును 11 రోజుల క్రితమే కొనుగోలు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెంది న తారీఖ్‌ పేరిట తప్పుడు డాక్యుమెంట్లతో దాన్ని కొనుగోలు చేశారని తెలిసినట్టు అధికారులు చెప్పా రు. అక్టోబరు 29న దానిని కొనగానే పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారని.. తర్వాత నేరుగా తీసుకెళ్లి అల్‌ ఫలాహ్‌ వర్సిటీలో పార్కింగ్‌ చేశారని వెల్లడించారు. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని గుర్తించినట్టు చెప్పారు. ఈ నెల 9న తోటి ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉగ్ర వైద్యుడు ఉమర్‌ నబీ ఆందోళనకు గురై దాక్కున్నాడని.. ఈ నెల 10న పేలుడు పదార్థాలున్న ఆ కారును తీసుకుని ఢిల్లీ వైపు బయలుదేరాడని తెలిపారు. పేలుడుకు ముందు ఈ కారు దాదాపు సగం ఢిల్లీ అంతా చుట్టేసి వచ్చినట్టు గుర్తించామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఉగ్ర వైద్యుడు ఉమర్‌ ఢిల్లీలోని ఆరు జిల్లాల పరిధిలోని 12 కీలక ప్రాంతాల్లో సంచరించినట్టు తేలిందని చెప్పారు. జనసమ్మర్థం, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే కీలక ప్రాంతాలు నేతాజీ సుభాష్‌ ప్లేస్‌, అశో క్‌ విహార్‌, కన్నాట్‌ ప్లేస్‌, రంజిత్‌ ఫ్లైఓవర్‌, డిలైట్‌ సినిమా, షహీద్‌ భగత్‌సింగ్‌ మార్గ్‌, రోహ్తక్‌ రోడ్‌, కశ్మీరీగేట్‌, దరియాగంజ్‌, ఎర్రకోట తదితర చోట్లకు వెళ్లినట్టు సీసీ కెమెరాల ఫుటేజీలతో గుర్తించినట్టు చెప్పారు. నిఘాను తప్పుదారిపట్టించేందుకు గానీ, పోలీసులు, భద్రతా ఏర్పాట్లు ఏ మేరకు ఉన్నాయని పరిశీలించేందుకు గానీ ఉమర్‌ ఇలా కీలక ప్రాం తాల్లో తిరిగి ఉంటాడని వెల్లడించారు.

మెల్లగా వచ్చి.. ఒక్కసారిగా పేలి..

కారు బాంబు పేలుడుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బుధవారం బయటికి వచ్చాయి. 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో రోడ్డు మొత్తం ట్రాఫిక్‌తో నిండి ఉంది. వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. సాయంత్రం 6.50 గంటల సమయంలో ఒక కారు పేలిపోయి భారీ అగ్నిగోళం ఏర్పడింది. ఆ కారుతోపాటు చుట్టుపక్కల ఉన్న వా హనాలు ధ్వంసమయ్యాయి. దాని ధాటి కి సీసీ కెమెరాలు కూడా ధ్వంసమై వీడి యో రికార్డింగ్‌ ఆగిపోయింది. ఆ క్షణం వరకు కంట్రోల్‌ రూమ్‌లో రికార్డయిన వీడియోను అధికారులు సేకరించారు.

Updated Date - Nov 13 , 2025 | 06:43 AM