Jaishankar: వాణిజ్య ఒప్పందాలు హై ప్రయారిటీ : కేంద్రమంత్రి జైశంకర్
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:38 PM
అంతర్జాతీయంగా వాణిజ్య కార్యకలాపాల్లో తలెత్తుతోన్న పరిణామాల నేపథ్యంలో భారత్ పూర్తి అప్రమత్తతతో ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు హై ప్రయారిటీగా ముందుకు సాగుతున్నామన్నారు.

Global Technology Summit: అంతర్జాతీయంగా వాణిజ్య కార్యకలాపాల్లో తలెత్తుతోన్న పరిణామాల నేపథ్యంలో భారత్ పూర్తి అప్రమత్తతతో ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు హై ప్రయారిటీగా ముందుకు సాగుతున్నామన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ తో 'వాణిజ్య ఒప్పందాల' చర్చలపై జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.'అత్యవసరానికి సిద్ధంగా ఉన్నామని'ఎలాంటి పరిస్థితుల్నైనా చాకచక్యంగా, సమయస్పూర్తితో ఎదుర్కొంటామని అన్నారు.
ముఖ్యంగా అమెరికా తీసుకున్న కొత్త టారిఫ్ అంశానికి సంబంధించి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో గురు, శుక్ర, శనివారాల్లో జరుగుతోన్న కార్నెగీ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో జైశంకర్ మాట్లాడారు.అమెరికా టారిఫ్స్ విషయంలో అనుసరిస్తోన్న వైఖరి క్రితం ఉన్న దానికంటే చాలా భిన్నంగా ఉండటం వలన భారతదేశ వాణిజ్య ఒప్పందాలు చాలా సవాలుతో కూడుకున్నవని ఆయన అన్నారు. చైనా తోనూ భారత్ కు సత్సంబంధాలే ఉన్నాయని ఇరు దేశాలతో చాలా సంబంధం కలిగి ఉన్నామని ఆయన అన్నారు.
అమెరికా చైనాలు వాణిజ్య పరంగా చాలా అగ్రస్థానంలో ఉన్నారని వారు ఏమి సాధించాలనుకుంటున్నారనే దానిపై పూర్తి అవగాహనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. భారతదేశం పట్ల అమెరికాకు ఉన్నట్లే, భారతదేశం కూడా వారి పట్ల ఒక దృక్పథాన్ని కలిగి ఉందని జైశంకర్ అన్నారు. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పురోగతి సాధిస్తోందని జైశంకర్ అన్నారు. సెమీకండక్టర్లకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రస్తుత గ్లోబల్ టెక్ సమ్మిట్ దేశం యొక్క సాంకేతిక వైపు సానుకూల మార్గాలకు దోహదకారి అవుతుందని అన్నారు.
For AndhraPradesh News And Telugu News