ISRO Signs Key Agreement: హాల్‌కు ఎస్‌ఎ్‌సఎల్వీ టెక్నాలజీ బదిలీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:52 AM
అంతరిక్ష రంగంలో పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. ..
ఇన్‌స్పేస్ ఆధ్వర్యంలో ఇస్రో కీలక ఒప్పందం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: అంతరిక్ష రంగంలో పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎ్‌సఎల్వీ) సాంకేతిక బదిలీకి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహిస్తున్న ఇన్‌స్పేస్ ఆధ్వర్యంలో జరిగిన 100వ సాంకేతిక బదిలీ ఒప్పందమిది. బెంగళూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఐఎల్), ఇన్‌స్పేస్, హాల్... ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. దీనికోసం రేసులో ఉన్న అదానీ గ్రూప్ మద్దతుగల సంస్థ డిజైన్ టెక్నాలజీస్ నేతృత్వంలోని కన్సార్టియంను వెనక్కు నెట్టి హాల్ ఈ ఒప్పందం చేసుకుంది. కాగా, ఎస్‌ఎ్‌సఎల్వీ టెక్నాలజీ బదిలీ కోసం ఇస్రో, హాల్, ఎన్‌ఎ్‌సఐఎల్ సంస్థలు కలిసిరావడం శుభపరిణామమని ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా అన్నారు. ఒప్పందంపై సంతకం చేసిన 24 నెలల్లోగా ఇస్రో ఎస్‌ఎ్‌సఎల్వీ టెక్నాలజీని హాల్‌కు బదలాయిస్తుంది.