India Israel relations: త్వరలో భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:44 AM
తాను, భారత్ ప్రధాని నరేంద్రమోదీ త్వరలో కలుసుకోనున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.....
జెరూసలేం, డిసెంబరు 11: తాను, భారత్ ప్రధాని నరేంద్రమోదీ త్వరలో కలుసుకోనున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ మేరకు మోదీ, నెతన్యాహు ఫోన్‌లో జరిగిన సంభాషణల్లో అంగీకారం కుదిరిందని ఇజ్రాయెలీ పీఎంవో గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘ఇరు నేతల మధ్య సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చల్లో కలుసుకోవడానికి అంగీకారం కుదిరింది’ అని ఆ పోస్టులో తెలిపారు. వివిధ రంగాల్లో వాణిజ్యంపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరు దేశాల మంత్రులు పరస్పరం భారత్, ఇజ్రాయెల్‌లలో పర్యటిస్తున్న నేపథ్యంలో భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటనపై ఆసక్తి నెలకొంది.