Share News

INS Androth: శత్రు సబ్‌మెరైన్లను పసిగట్టే ఆండ్రోత్‌

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:20 AM

భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. తీర ప్రాంతానికి సమీపంలోని సముద్ర జలాల్లో మాటువేసిన శత్రుదేశాల జలాంతర్గాముల....

INS Androth: శత్రు సబ్‌మెరైన్లను పసిగట్టే ఆండ్రోత్‌

  • విశాఖ తీరంలో జలప్రవేశం

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. తీర ప్రాంతానికి సమీపంలోని సముద్ర జలాల్లో మాటువేసిన శత్రుదేశాల జలాంతర్గాముల (సబ్‌మెరైన్‌)ను పసిగట్టే సామర్థ్యం కలిగిన ఐఎన్‌ఎ్‌స ఆండ్రోత్‌ విశాఖ తీరంలో జలప్రవేశం చేసింది. విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు నౌకాదళం వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ ఈ నౌకను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఆండ్రోత్‌’ చేరికతో భారత నౌకాదళం శక్తి, సామర్థ్యాలు మరింత పెరుగుతాయన్నారు. ఈ నౌక తయారీకి కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్‌ అండ్‌ ఇంజనీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ)కు చెందిన ఇంజనీర్లు, డిజైనర్స్‌ శక్తివంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. భారత నేవీలో చేరిన రెండో యాంటీ సబ్‌మెరైన్‌ వాటర్‌ఫేర్‌షాలో వాటర్‌క్రాఫ్ట్‌గా ఆండ్రోత్‌ నిలిచిందన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 02:20 AM