Share News

Indigo Discrimination: విమానం నడిపే అర్హత లేదు..చెప్పులు కుట్టుకో

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:07 AM

నీకు విమానం నడిపే అర్హత లేదు. వెళ్లి చెప్పులు కుట్టుకో.. నువ్వు ఇక్కడ కనీసం వాచ్‌మన్‌గా కూడా పనికిరావు... అని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీనియర్‌ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని బెంగళూరుకు...

Indigo Discrimination: విమానం నడిపే అర్హత లేదు..చెప్పులు కుట్టుకో

  • ట్రైనీ పైలట్‌ను దూషించిన ఇండిగో అధికారులు

బెంగళూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘నీకు విమానం నడిపే అర్హత లేదు. వెళ్లి చెప్పులు కుట్టుకో.. నువ్వు ఇక్కడ కనీసం వాచ్‌మన్‌గా కూడా పనికిరావు...’ అని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీనియర్‌ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల ట్రైనీ పైలట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇండిగో అధికారులు తపస్‌ డే, మనీశ్‌ సాహ్ని, కెప్టెన్‌ రాహుల్‌ పాటిల్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత పైలట్‌ సోమవారం బెంగళూరు పోలీసులను ఆశ్రయించగా... వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఇండిగో ప్రధాన కార్యాలయం ఉన్న గుర్‌గావ్‌కు బదిలీ చేశారు. పైలట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఇండిగో ప్రధాన కార్యాలయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అధికారులు దూషించారని, వృత్తిపరంగా బలిపశువును చేశారని ఆరోపించారు.

Updated Date - Jun 24 , 2025 | 03:11 AM