త్వరలో అందుబాటులోకి శత్రునాశ్, అగ్ని అస్త్ర..!
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:02 AM
భారత సాయుధ దళాల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘శత్రునాశ్’, ‘అగ్నిఅస్త్ర’ అనే రెండు అస్త్రాలు త్వరలోనే సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 12: భారత సాయుధ దళాల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘శత్రునాశ్’, ‘అగ్నిఅస్త్ర’ అనే రెండు అస్త్రాలు త్వరలోనే సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి. అగ్నిఅస్త్ర.. బహుళ లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుంది. దీని సాయంతో శత్రువు బంకర్లు, వంతెనలు, బలమైన నిర్మాణాలను కూల్చివేయవచ్చు. అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లి సైనిక లక్ష్యాలపై ఇది స్వతంత్రంగా కాల్పులు జరపగలదు.
మానవ సహిత వైమానిక విమానాలు, మానవ రహిత వైమానిక వాహనాల ద్వారా వీటిని మోహరించవచ్చు. ఇక శత్రునాశ్ అనేది ఒక విద్యుదయస్కాంత పల్స్ (ఈఎంపీ) గన్. దీనిలోని సెన్సర్లు ఈఐడీలు, డ్రోన్లు, వాహనాలు, ఏదైనా ఎలకా్ట్రనిక్ ఆధారిత లక్ష్యాలను అడ్డుకుంటాయి. ఈ రెండు అస్ర్తాలు భారత సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.