Share News

Elan Musk: రాయిటర్స్‌ బ్లాకింగ్‌పై X వాదనను తోసిపుచ్చిన కేంద్రం

ABN , Publish Date - Jul 08 , 2025 | 09:39 PM

ఇండియాలోని రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్ ఎక్స్ అకౌంట్లు శనివారం నిలిచిపోవడంతో తాము సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలతో సంప్రదింపులు జరిపామని, వాటిని అన్‌బ్లాక్ చేయమని కోరామని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Elan Musk: రాయిటర్స్‌ బ్లాకింగ్‌పై X వాదనను తోసిపుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: రాయిటర్స్ సహా గ్లోబల్ న్యూస్ ఎజెన్సీల ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేసేందుకు జూన్ 3న తాము ఎలాంటి తాజా ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారంనాడు తెలిపింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఎ సెక్షన్ కింద రాయిటర్స్‌తో సహా ఇండియాలోని తమ 2,355 ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలను బ్లాక్ చేయాలని జూలై 3న కేంద్రం ఆదేశించినట్టు 'ఎక్స్' గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ప్రకటించడం సంచలనమైంది. దీనిపై కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది.


ఇండియాలోని రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్ ఎక్స్ అకౌంట్లు శనివారం నిలిచిపోవడంతో తాము సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలతో సంప్రదింపులు జరిపామని, వాటిని అన్‌బ్లాక్ చేయమని కోరామని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఇది 'ఎక్స్' వాదనకు భిన్నంగా ఉంది. భారత్‌లోని 2,355 ఖాతాలను బ్లాక్ చేయాలని 'ఎక్స్'ను ఆదేశించినట్టు 'ఎక్స్' తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్ ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని 'ఎక్స్'ని ప్రభుత్వం అభ్యర్థించిందని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

పాక్‌వన్నీ బూటకాలే.. కూలింది ఒక రాఫెలే, అది కూడా..

ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 09:40 PM