Share News

Kochi: సముద్రంలో ఒరిగిన విదేశీ నౌక

ABN , Publish Date - May 25 , 2025 | 04:01 AM

కోచి సమీపంలో విదేశీ సరకు నౌక సముద్రంలో ఒరిగిపోయింది. ప్ర‌మాదం నుంచి 21 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ రక్షించింది.

Kochi: సముద్రంలో ఒరిగిన విదేశీ నౌక

న్యూఢిల్లీ, మే 24: కేరళలోని కోచి సమీపంలో శనివారం విదేశీ సరకు రవాణా నౌక ఒకటి సముద్రంలో ఒరిగిపోయింది. ఆ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా అందులో 21 మందిని ఇండియన్‌ కోస్టుగార్డ్‌ కాపాడింది. లైబేరియా జెండాతో శుక్రవారం విజినం పోర్టు నుంచి బయలుదేరిన ఆ నౌక శనివారం రాత్రి పది గంటలకు కోచి చేరాల్సి ఉండగా సముద్రంలో ప్రమాదానికి గురయింది. కోచికి 38నాటికల్‌ మైళ్ల దూరంలో 26 డిగ్రీల మేర ఒరిగిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది కోస్ట్‌గార్డ్‌కు సమాచారం పంపడంతో ఆ సిబ్బంది వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. ఆ నౌక తీసుకెళ్తున్న కంటెయినర్లలో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని, అటువైపు ఇతరులు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. కంటెయినర్లను వేరే నౌకల్లోకి మార్చే పనులను చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:01 AM