Dhruv NG Civil Helicopter: ధ్రువ్ ఎన్‌జీతో నవ చరిత్ర
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:12 AM
స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తిలో మన దేశం మరో మైలురాయి అధిగమించింది. ఆధునిక తరం పరిజ్ఞానంతో రూపొందించిన, పలు సేవలకు వినియోగించుకోగలిగే పౌర హెలికాప్టర్ ధ్రువ్ ఎన్‌జీ మంగళవారం...
స్వదేశీ పౌర హెలికాప్టర్ సిద్ధం
బెంగళూరులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్
బెంగళూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తిలో మన దేశం మరో మైలురాయి అధిగమించింది. ఆధునిక తరం పరిజ్ఞానంతో రూపొందించిన, పలు సేవలకు వినియోగించుకోగలిగే పౌర హెలికాప్టర్ ధ్రువ్ ఎన్‌జీ మంగళవారం తొలిసారి విజయవంతంగా పైకెగిరింది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు బెంగళూరులో దీనిని ప్రారంభించారు. ఈ హెలికాప్టర్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) రూపొందించి, ఉత్పత్తి చేస్తోంది. ధ్రువ్ ఎన్‌జీ గంటకు 285 కి.మీ. వేగంతో, ఏకబిగిన 630 కి.మీ. ప్రయాణించగలదు. ఒక్కసారి ఇంధనం నింపితే 3.40 గంటలు గాలిలో ఉండగలిగే సామర్థ్యంతో పాటు 6 వేల మీటర్ల ఎత్తులో కూడా ఎగరగలదు. 14 మంది దీనిలో ప్రయాణించడానికి అవకాశం ఉంది. భారత ఏవియేషన్ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని రామ్మోహన్‌నాయుడు అన్నారు. హెలికాప్టర్‌లో ఆయన పైలట్‌తో పాటు కొద్ది సేవు విహరించారు.