Share News

Galwan War Memorial in Ladakh: లద్దాఖ్‌లో గల్వాన్‌ యుద్ధ స్మారకం

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:43 AM

గల్వాన్‌లో చైనాతో ఘర్షణ జరిగిన ఐదేళ్ల తర్వాత భారత్‌.. లద్దాఖ్‌లోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో యుద్ధస్మారకాన్ని నిర్మించింది....

Galwan War Memorial in Ladakh: లద్దాఖ్‌లో గల్వాన్‌ యుద్ధ స్మారకం

  • ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 7: గల్వాన్‌లో చైనాతో ఘర్షణ జరిగిన ఐదేళ్ల తర్వాత భారత్‌.. లద్దాఖ్‌లోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో యుద్ధస్మారకాన్ని నిర్మించింది. 2020 జూన్‌ 15 రాత్రి సమయంలో చైనా బలగాలతో వీరోచిత పోరాటం చేసి అమరులైన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. భారత్‌ రణ్‌భూమి దర్శన్‌ కార్యక్రమం కింద.. త్యాగం, వీరత్వానికి ప్రతీకగా ఎరుపు-నలుపు రంగు గ్రానైట్‌ రాళ్లతో త్రిశూలం-ఢమరుకం ఆకారంలో ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌లో మ్యూజియం, డిజిటల్‌ గ్యాలరీ, గల్వాన్‌ ఘటన వివరాలు, లడక్‌ సైనిక చరిత్రను తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఆడిటోరియం కూడా నిర్మించారు. మరోవైపు చైనాలోని షాంఘైలో భారత్‌ కొత్త కాన్సులేట్‌ భవనాన్ని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని చైనాలో భారత రాయబారి ప్రదీప్‌ రావత్‌ దీన్ని ప్రారంభించారు.

Updated Date - Dec 08 , 2025 | 03:43 AM