India to Manufacture Sukhoi 57: భారత్‌లో సుఖోయ్-57 ఇంజన్ల తయారీ!
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:33 AM
భారత్ సొంతంగా ఐదవ తరం యుద్ధ విమానాలు తయారు చేసుకునే దిశగా కీలక ముందడుగు పడింది. వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అనంతరం..
సాంకేతికత బదిలీకి రష్యా గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ, డిసెంబరు 10: భారత్ సొంతంగా ఐదవ తరం యుద్ధ విమానాలు తయారు చేసుకునే దిశగా కీలక ముందడుగు పడింది. వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అనంతరం.. సుఖోయ్-57ఈ జెట్ ఇంజన్ల సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయడానికి రష్యా ఆమోదించినట్టు తెలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా సుఖోయ్-57ఈ ఫైటర్ జెట్లలో ఉపయోగించే అత్యాధునిక ఇజ్డెలియే 177ఎస్ థ్రస్ట్-వెక్టొరింగ్ టర్బో ఫ్యాన్ ఇంజన్లను ఒడిసాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) కోరాపుట్ డివిజన్‌లో తయారు చేస్తారని ఓ నివేదిక తెలిపింది. ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ... ఈ ఒప్పందం కుదిరి భారత్‌లో సుఖోయ్-57ఈ ఇంజన్లు తయారు చేస్తే.. ఐదవ తరం ఫైటర్ ప్రొపల్షన్‌ను స్వదేశీయంగా అభివృద్ధి చేసే సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్.. రష్యా, అమెరికా, చైనా సరసన నిలవనుంది.