ISRO Chief: 2040లో చంద్రుడిపై జాతీయ జెండా ఎగరేస్తాం
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:45 AM
2040 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్‌ను చంద్ర మండలంలోకి విజయవంతంగా ప్రయోగిస్తామని...
పుట్టపర్తి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): 2040 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్‌ను చంద్ర మండలంలోకి విజయవంతంగా ప్రయోగిస్తామని, చంద్రుడిపై జాతీయ జెండాను పాతుతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న కేరళ సంప్రదాయ ఓనం వేడుకల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.