India Offers Positive Trade: భారత్ నుంచి అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:31 AM
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా చర్చల ప్రతినిధి జేమీసన్ గ్రీర్ తెలిపారు....
భారత్‌తో అమెరికా వాణిజ్య చర్చల ప్రతినిధి జేమీసన్ గ్రీర్
వాషింగ్టన్/జైపూర్, డిసెంబరు 10: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా చర్చల ప్రతినిధి జేమీసన్ గ్రీర్ తెలిపారు. మంగళవారం అమెరికా సెనేట్ కమిటీ ముందు హాజరై వాణిజ్య చర్చల పురోగతిని వివరించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిపై కొంత అభ్యంతరా లు ఉన్నా.. మొత్తంగా చర్చల్లో భారత్ సానుకూలంగా ఉందని చెప్పారు. కొన్ని పంటల దిగుమతి విషయంలో భారత్‌లో నిరసన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధి బృందం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉందని, చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. అమెరికా ఉత్పత్తుల కోసం తన మార్కెట్‌ను తెరిచేందుకు భారత్ సిద్ధంగానే ఉందని చెప్పారు. అమెరికాతో వాణిజ్య చర్చల్లో మంచి పురోగతి ఉందని భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా తెలిపారు. జైపూర్‌లో నిర్వహిస్తున్న రాజస్థానీ ప్రవాసీ దివ్‌సలో బుధవారం ఆయన మాట్లాడారు.